వైసీపీ సోషల్ మీడియా ప్రతినిది వర్రా రవీంద్ర రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిన్న మహబూబ్ నగర్ సరిహద్దులో రవీంద్రరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు.. ఇప్పటికీ కోర్టులో ప్రవేశ పెట్టకపోవటం పై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. తన భర్తను చంపేందుకు కుట్ర పన్నారని భయపడుతున్నారు రవీంద్ర భార్య కళ్యాణి.
తాజాగా రవీంద్ర భార్య వర్రా కళ్యాణి మాట్లాడుతూ.. రవీంద్రరెడ్డిని వెంటనే కోర్టులో హాజరుపరచాలి. లేకపోతే డీజీపి ఆఫీసు ఎదుట కుటుంబమంతా కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అన్నారు. ఇక టీడీపి కార్యకర్త ఒకరు రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి మహిళలపై పోస్టులు పెట్టారు. దానిపై రవీంద్ర ఫిర్యాదు చేయటంతో గతంలోనే అతన్ని అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే సాకుతో రవీంద్రరెడ్డిని ఎలా అరెస్టు చేస్తారు అని ప్రశ్నించారు. ఇక బీటెక్ రవి, పోలీసుల మాటలు చూస్తుంటే మాకు భయమేస్తోంది. రవీంద్రరెడ్డికి ప్రాణహాని ఉంది అని కళ్యాణి అన్నారు.