తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం పై తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నేను పార్టీ మారడం లేదని వెల్లడించారు. ఒంగోలు ఎంపీ మాగుంటకే మళ్లీ ఎంపీ టికెట్ ఇస్తే అన్ని నియోజకవర్గాలకు బాగుంటుందని భావించాను. దీంతో నేను అధిష్టానం పై అలిగానని ప్రచారం చేస్తున్నారు. ఇది ఎందుకు వచ్చిన గోల. అధిష్టానం ఏది చెబితే నేను అదే చేస్తా. నా ఒంగోలు నేను చూసుకుంటా అని బాలినేని స్పష్టం చేశారు.
ఒంగోలు ఎంపీ అభ్యర్థి అంశంలో మెట్టుదిగిన బాలినేని.. ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవ్వరైనా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మిగతా వాళ్లకు పట్టనప్పుడు నాకు మాత్రం ఎందుకు అని పేర్కొన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. గత కొద్ది రోజుల నుంచి మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వకుంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారనున్నారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.