నాకు సీఎం పదవి అక్కర్లేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆరు నెలల ముందే ప్రకటించాలని రాహుల్ గాంధీ టిపిసిసి స్టార్ క్యాంపేయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కోరారు. శుక్రవారం రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో లాబీయింగ్ చేసే నేతలకు కాకుండా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు టికెట్లు ఇవ్వాలని కోరారు. 2018 ఎన్నికల్లో పొత్తుల పేరుతో నామినేషన్ల చివరి రోజు జాబితా ప్రకటించడంతో పార్టీకి నష్టం కలిగింది అన్నారు.

రాహుల్ కు అర్థమయ్యేలా హిందీలో మాట్లాడారు. “నాలాంటి వాళ్ళకు పదవులు అవసరం లేదు. సీఎం పదవి అక్కర్లేదు. మంత్రి పదవి త్యాగం చేసి తెలంగాణ కోసం సోనియా ను ఒప్పించాం. దళితుడిని సిఎం చేయని కేసీఆర్ కు మెడ మీద తల ఉందా? అని ప్రశ్నించారు. సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, బిజెపి ఎవరితో పొత్తు వద్దు. ఒంటరిగా పోటీ చేద్దామని కార్యకర్తలకు కోరుతున్నారు” అని చెప్పారు.