నాకు బైనాక్యులర్ గుర్తు వద్దు – వైఎస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉమ్మడి గుర్తును కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

I don't remember binoculars  said YS Sharmila
I don’t remember binoculars said YS Sharmila

అయితే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంపై వైఎస్‌ షర్మిల అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయించడంపై వైఎస్సార్టిపి పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో గుర్తు కేటాయించాలని ఆ పార్టీ అధినేత్రి షర్మిల సీఈసీని ఆశ్రయించారు. నాకు బైనాక్యులర్ గుర్తు వద్దంటూ షర్మిల స్పష్టం చేశారు. మరి దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news