ఐఏఎస్, ఐపీఎస్ లు జాగ్రత్తగా ఉండాలి : కేటీఆర్

-

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే  పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఇవాళ మార్నింగ్ వాక్ లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వికారాబాద్ కి తరలించి విచారించారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు ఉద్రిక్తత చేయడంతో  మళ్లీ అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

పరిగి నుంచి కొడంగల్ కి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరు పరిచారు. పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పారు. మరి కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అధికారులు అతి చేస్తే ఏపీలో ఏం జరిగిందో చూస్తున్నాం. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్రమ అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news