అపర సంజీవని 108 అంబులెన్స్ లకు కూటమి ప్రభుత్వంలో ఆపద వచ్చిపడింది అని వైఎస్ షర్మిల అన్నారు. ఫోన్ కొడితే కుయ్ కుయ్ మంటూ క్షతగాత్రుల వద్దకు చేరే ఆరోగ్య ప్రదాయిని మూగబోతుంది. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలకు అండగా నిలిచే అంబులెన్స్ వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్నారు. వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఏక్యూప్మెంట్ సమకూర్చకుండా.. రిపేర్లు వస్తే చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. ఇంధనం లేదని గత నెల 140 వాహనాలు ఆపడం ఏంటి.. 90 వాహనాలు ఇప్పటికీ రిపేర్లు ఉన్నా పట్టించుకు పోవడం ఏంటి అని ప్రశ్నించారు.
మహానేత YSR మానస పుత్రిక 108 అంబులెన్స్. YSR దూర దృష్టికి నిదర్శనం. దేశంలో ఎన్నో రాష్ట్రాలకు 108 వ్యవస్థ ఆదర్శం. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సంజీవని. ఇలాంటి వ్యవస్థకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రహణం పడుతోంది. నేడు 108 ఉద్యోగ సంఘాలు నేతల మమ్మల్ని కలవడం జరిగింది. 108 వ్యవస్థలో నెలకొన్న సమస్యలను వివరించడం జరిగింది. ఎవరు అధికారంలో ఉన్నా అంబులెన్స్ ఆగకుండా ఉండాలంటే .. వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తే బాగుంటుందని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్ న్యాయబద్ధమైనదే కాబట్టి, వెంటనే చర్చలకు పిలిచి… సమస్యలు పరిష్కరించాలని, 108 వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని షర్మిల పేర్కొన్నారు.