బదిలీపై స్పందించిన ఐఏఎస్ అధికారి టి.కె.శ్రీదేవి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై వేటు వేసింది. వారిని ఇతర ప్రదేశాలకు బదిలీ చేయాలని సీఎస్ శాంతికుమారినకి లేఖ పంపింది. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చే వరకు వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ క్రమంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పోస్టు నుంచి ఐఏఎస్ అధికారిణి టీకే శ్రీదేవిని కూడా సీఈసీ బదిలీ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఆమె తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇంతకీ ఆమె ఏం అన్నారంటే.. ?

‘‘కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నేను బాధ్యతలు తీసుకున్నాను. ఇటీవలే బాధ్యతలు తీసుకుంటే ఆ శాఖ పనితీరుకు నేను బాధ్యురాలిని అవుతానా?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్‌ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్‌, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌, రవాణాశాఖ కార్యదర్శులను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతోనే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలంటూ సీఎస్​కు లేఖ పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news