తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగలను భర్తీ చేయడానికి సిద్ధం అవుతుంది. దాని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించాలని ఆయా శాఖ కార్యదర్శులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఖాళీలపై చర్చించడానికి అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించాలని కార్యదర్శులను ఆదేశించారు. అలాగే ఖాళీలను గుర్తించి వీలైనంత త్వరగా రిపోర్టును మంత్రి వర్గానికి సమర్పించాలని అన్నారు. అలాగే ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలో ఏర్పాడ్డ కమిటీ చేస్తున్న పని తీరు గురించి కూడా సీఎస్ సోమేశ్ కుమార్ తెలుసుకున్నారు. ఉద్యోగ భర్తీలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. వేగంగా ఖాళీల గుర్తింపు ప్రక్రియా పూర్తి చేసి మంత్రి వర్గానికి నివేదించాలని సూచించారు. అలాగే ఇటీవల ప్రమోషన్స్ వల్ల కూడా ఏర్పడ్డ ఖాళీలను కూడా గుర్తించాలని సీఎస్ అన్నారు.