ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ను తన నివాసంలో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఆయనకు గాంధీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. మేజిస్ట్రేట్ విచారణ చేపట్టిన తరువాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఆ తరువాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. దీంతో హైకోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సొంత పూచీకత్తు 50వేలు సమర్పించాలని అల్లు అర్జున్ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది హైకోర్టు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ చాలా రిసెప్షన్ లో వెయిట్ చేస్తున్నాడు. బెయిల్ ఉత్తర్వులు హైకోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు ఇంకా రాకపోవడంతో ఈరోజు అల్లు అర్జున్ జైలులోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. బెయిల్ కి సంబంధించిన ఉత్వర్వుల కాపీలు ఆన్ లైన్ లో ఇంకా అప్ లోడ్ కాలేదని.. ఇవాల విడుదలయ్యే అవకాశం లేదని జైలు అధికారులు పేర్కొంటున్నారు.