అసత్య ఆరోపణలు చేఅసత్య ఆరోపణలు చేస్తే మంత్రి ని అయినా, సీఎం ని అయినా తాట తీస్తాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ తో సంబంధం లేదని అన్నారు. నేను ఎవర్నో హీరోయిన్ ను బెదిరించాను అని ఒక మంత్రి ఆరోపణలు చేశారని మండిపడడారు. నాకు హీరోయిన్ ను బెదిరించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. నాపై అసత్య ఆరోపణలు చేస్తే మంత్రి ని అయినా, సీఎం ని అయినా తాట తీస్తానని హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ వస్తే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని చెప్పామన్నారు. ఇప్పుడే అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో నీళ్ల కోసం తల్లడిల్లి పోతున్నారని తెలిపారు.
హైదరాబాద్ లో నీటి కోసం యుద్ధాలు మొదలు అయ్యాయన్నారు. ఈ అసమర్థ సీఎం దన వనరులు ఢిల్లీ తరిలించే ప్రయత్నం తప్ప జల వనరులు తెచ్చే ప్రయత్నం చేయట్లేదన్నారు. మేము 38 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టామన్నారు. దాని నిర్వహణ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేక పోతుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఖచ్చితంగా పోతాయన్నారు. ఖైరతాబాద్, ఘనపూర్ లలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఈ ఆదివారం లోపు స్పీకర్ తేల్చకుంటే.. కోర్టు కు పోతామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అనర్హత వేయాలని ఉందన్నారు. కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టావా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడని తెలిపారు.