జబర్దస్త్ యాదమ్మ రాజు అరెస్ట్..!

-

జబర్దస్త్ నటుడు యాదమ్మ రాజు గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. పటాస్ షో ద్వారా బుల్లితెరకి పరిచయం అయ్యాడు తర్వాత నెంబర్ వన్ షో జబర్దస్త్ తో పాపులారిటీని పెంచుకున్నాడు. కొద్ది కాలంగా పలు టీవీ షోలలో కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తూ వచ్చాడు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో కొన్ని వీడియోస్ ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు యాదమ్మ రాజు పలు చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. తాజాగా ఒక వీడియోని షేర్ చేశాడు ఒక కేసులో తనని పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

నన్ను పోలీసులు స్టేషన్ కి పట్టుకుని వెళ్లారు. ఏప్రిల్ ఫస్ట్ కి ఇక ఇష్యూ అవ్వడం వలన నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఎందుకు పట్టుకుని పోయారో ఏంటో కింద లింక్ క్లిక్ చేస్తే అర్థం అవుతుంది అని అన్నాడు. అదంతా తను నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం అలా వెరైటీగా చేసినట్లు తెలుస్తోంది. హూ ఈజ్ మై డాడీ అనే వెబ్ సిరీస్ లో యాదమ్మ రాజు కీలకపాత్రలో నటించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది అందుకని ఈ విధంగా యాదమరాజు పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అందరూ యాదమ్మ రాజు పెట్టిన పోస్ట్ చూసి అవాక్కవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version