సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసిఆర్ నాంపల్లి దర్గా దగ్గర అడుక్కునేవాడు – VH

-

రాబోయే ఎన్నికల కోసం ఇంకొంచెం గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారని.. నువ్వెందుకు వేస్తావు.. జనం నిన్నే భంగళాఖాతంలో వేస్తారని మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ నాంపల్లి దర్గా దగ్గర “అల్లాకే నాంపే దేదో బాబా” అంటూ అడుక్కునేవాడని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అన్నం పెట్టినోనికి సున్నం పెడతాడని అన్నారు. ఇక దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందని.. పప్పు అన్న మా రాహుల్ పప్పా అయ్యాడు.. మీ బాబై కూర్చున్నాడన్నారు. ఈ సారి ప్రధాని రాహుల్ అవుతాడని.. లేకుంటే నా పేరు హనుమంతరావు కాదని ఛాలెంజ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఆదానికి, మోడీకి ఎం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు.

మా దగ్గర ఉంటే అవినీతి పరులు.. బీజేపీలో చెరితే సత్యహరిచంద్రులా..? అని ప్రశ్నించారు. త్వరలోనే బీసీ గర్జన పెడుతమని.. అందుకు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ ఒప్పుకున్నారని తెలిపారు. అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుందన్నారు వి హనుమంతరావు. అగ్రకులాల వాళ్ళు ఓబీసీలను అనగదొక్కుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version