బాబు కోసం పవన్ కష్టం..పురందేశ్వరి సపోర్ట్.!

-

రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పి-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఢిల్లీలో బి‌జే‌పి పెద్దలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఎలాగైనా టి‌డి‌పి-బి‌జే‌పి కలిసేలా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జనసేనతో పొత్తులో కొనసాగుతున్న బి‌జే‌పి..టి‌డి‌పితో మాత్రం పొత్తు పెట్టుకోమని చెప్పింది. అయితే అలా చెప్పింది రాష్ట్ర బి‌జే‌పి నేతలు కొందరు..అలాగే రాష్ట్ర ఇంచార్జ్‌లు మాత్రమే..కేంద్ర నాయకత్వం ఎప్పుడు పొత్తుల గురించి మాట్లాడలేదు.

అయితే ఈ మధ్య ఏపీ బి‌జే‌పి అధ్యక్ష స్థానం మార్చడంతో పొత్తులపై బి‌జే‌పి రెడీగా ఉందని సంకేతాలు ఇచ్చినట్లు అయింది. వైసీపీ అనుకూలంగా ఉండే సోము వీర్రాజుని సైడ్ చేయడం ద్వారా..టి‌డి‌పికి బి‌జే‌పి దగ్గరవుతుందని తెలుస్తుంది. దానికి ముందే చంద్రబాబు..అమిత్ షా, జే‌పి నడ్డాలని కలిశారు. దీంతో పొత్తు ఫిక్స్ అయినట్లు కనిపించింది. మళ్ళీ గ్యాప్ వచ్చింది. తాజాగా ఎన్డీయే సమావేశాలకు ఢిల్లీ వెళ్ళిన పవన్..పొత్తులకు రెడీ అని చెప్పారు. మూడు పార్టీలు కలిసి వైసీపీని గద్దె దించుతాయని అన్నారు.

అయితే బి‌జే‌పి-జనసేన కలిసే ఉన్నాయని. ఇక తమతో టి‌డి‌పి కలుస్తుందో లేదో తేల్చుకోవాలని అన్నారు. అదే సమయంలో పవన్ ఢిల్లీలోనే ఉంటూ..బి‌జే‌పి పెద్దలని కలుస్తూ..టి‌డి‌పితో పొత్తుకు ఒప్పిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా పవన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ నేతలు అదే తరహాలో విమర్శలు చేస్తున్నారు. బాబు కోసం పవన్ ఢిల్లీలో కష్టపడుతున్నారని, లాబీయింగ్ చేస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో ఏపీ బి‌జే‌పి అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం..పవన్ తో ఫోన్ లో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రంలో బి‌జే‌పి-జనసేన నేతలు భేటీ అవుతారని చెప్పారు. ఇక టి‌డి‌పితో పొత్తు అంశం జాతీయ నేతలు తేలుస్తారని చెప్పుకొచ్చారు. మొత్తానికి టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు దిశగా వెళుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version