చెట్లను కత్తిరిస్తే ఇబ్బందులు తప్పవు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

-

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి’ అని మంత్రి పొన్నం ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్నీ ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా.. మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలన్నారు. పిల్లలకు ప్రతి రోజూ మొక్కలకు నీళ్ళు పోసే విధంగా అలవాటు చేయాలని వెల్లడించారు.

మనం మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనల్ని రక్షిస్తుందని తెలిపారు. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా చెట్లు కత్తిరించడం మొక్కలు నాటకపోవడం ప్లాస్టిక్ వాడడం వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే కాలుష్యం పెరిగి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు సంఖ్య పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రతి బిడ్డా ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పొన్నం వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news