దసరా పండుగ రోజున పాలపిట్టను బంధిస్తే జైలుశిక్ష అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. దసరా రోజున పాలపిట్టను చూస్తే శుభం జరుగుతుందని నమ్మకం. దీంతో కొంతమంది వీటిని ప్రదర్శిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అయితే అటవీ చట్టం పరిధిలోకి వచ్చే ఈ పక్షిని బంధించడం, హింసించడం చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయని…. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ. 25 వేల వరకు ఫైన్ పడే ఛాన్స్ ఉందని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ పక్షుల సంఖ్య తగ్గుతున్నట్లు స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ నివేదిక పేర్కొంది.
ఇది ఇలా ఉండగా.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు చెప్పారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభా కాంక్షలు చెప్పారు.