తెలంగాణలోని ప్రతి జిల్లాలో హైడ్రా అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాలలో ధ్యాన్ చంద్ కు నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ లోని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
తెలంగా రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లా లో అమలు చేసేందుకు ప్రభుత్వము చర్యలు చేపడుతుందని ప్రభుత్వ చెరువులను భూములను ఆక్రమ కట్టడాలు చేపడితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించదన్నారు. ఎంత వారినైనా ఉపేక్షించకుండా ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయిని సరఫరా చేస్తున్న వారిపై ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతున్నామని గంజాయి నిర్మూలించేందుకు సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి గంజాయిని లేకుండా చేస్తామన్నారు పొన్నం.