మైనార్టీలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే మైనార్టీ బంధు పథకం అమలు

-

తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలకు క్రిస్టియన్ మైనార్టీ బంధు పథకానికి ఆగస్టు 19న శ్రీకారం చుట్టనున్నారు. అర్హులైన వారికి ఆగస్టు 19 నుంచి మైనార్టీ బంధు చెక్కులను అందించనున్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో లాంఛనంగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8047 మంది లబ్ధిదారులు ఉన్నారు.  దాదాపు రూ. 79 కోట్ల 9 లక్షలు  లబ్దిదారులకు మొదటి విడత పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ లోనే మైనార్టీ బంధు లబ్ధిదారులు అత్యధికంగా  ఉన్నారు. చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు సమాచారం. 

బీసీ బంధు తరహాలోనే మైనార్టీ బంధు పథకం కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో మైనార్టీ ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు లబ్ది పొందుతారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల జాబితాలను సిద్ధం చేశారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం మైనార్టీ సంక్షేమ శాఖ లేదా కలెక్టర్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version