సక్సస్‌ స్టోరీ : టేబుల్‌ క్లీనర్‌ నుంచి మొదలైన జీవితం…నేడు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు..!!

-

సక్సస్‌ ఎప్పుడు ఒక రాత్రిలో ఒక రోజులో రాదు. దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రుళు, కాలే కడుపుతో నడిచిన దారులు ఉంటాయి. అప్పుడు ఈ ప్రపంచం మనల్ని గుర్తించదు. ఎప్పుడైతే.. మీరు విజయం సాధిస్తారే.. మీ సక్సస్‌ స్టోరీ కవర్‌ స్టోరీ అవుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, రూ.100తో ఢిల్లీలో అడుగుపెట్టారు. అసమానతలను ఎదుర్కొంటూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన సక్సెస్ స్టోరీ తెలుసుకుందామా..!.

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో దేబ్‌నాథ్ పుట్టారు. 1988లో ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. సెకండరీ ఎగ్జామ్స్‌ రాసిన తర్వాత కేవలం రూ.100 జేబులో పెట్టుకుని ఢిల్లీ బయలుదేరారు. అందులో సగం రైలు ఛార్జీకి ఖర్చయిపోయాయి. అప్పటి నుంచి బతకు పోరాటం మొదలుపెట్టిన దేబ్‌నాథ్ ఇప్పుడు ‘దేబ్‌నాథ్ క్యాటరర్స్ అండ్‌ డెకరేటర్స్‌’కి యజమాని. రూ.200 కోట్ల రూపాయల సంపదను ఆయన సృష్టించారు. టీ తోటలు సహా దేశవ్యాప్తంగా ఆస్తులను వెనకేశారు. క్యాటరింగ్ వ్యాపారంతో పాటు ఆరు రైళ్లలో ప్యాంట్రీలను నిర్వహిస్తున్నారు.

దేబ్‌నాథ్ కుటుంబం గౌరవప్రదమైన నేత వ్యాపారాన్ని నిర్వహించేది. ఆయన తాత పేద పిల్లల కోసం పాఠశాలను నిర్మించడానికి భూమిని విరాళంగా ఇచ్చారు. అయితే రాజకీయ వివాదాల్లో వారి వ్యాపారం అగ్ని ప్రమాదంలో ధ్వంసమైంది. అప్పటికి ఆయన వయసు ఆరేళ్లు మాత్రమే. దీంతో దేబ్‌నాథ్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. తిరిగి వ్యాపారం మొదలుపెట్టినా, కుటుంబానికి ఆర్థిక కష్టాలు మాత్రం తప్పలేదు. 1980 ప్రారంభంలో వారి పరిస్థితి మరింత దిగజారింది.

దేబ్‌నాథ్ తండ్రి ఉద్యోగం కోసం వెతికారు. అతని అక్క, ఇద్దరు తమ్ముళ్లు పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో దేబ్‌నాథ్ తన కుటుంబం ప్రారంభించిన టీ వ్యాపారాన్ని చూసుకున్నారు. పాఠశాల అయిపోయిన తర్వాత అవిశ్రాంతంగా పని చేసేవారు. మూడేళ్లపాటు వ్యాపారాన్ని నిర్వహించారు. 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత చదువును పక్కన పెట్టారు. తల్లి దగ్గర రూ.100 తీసుకుని ఢిల్లీకి బయలుదేరారు.

ఢిల్లీకి చేరుకున్న తర్వాత, దేబ్‌నాథ్ క్యాటరర్‌గా పనిచేశారు. పాత్రలను శుభ్రం చేయడం, టేబుల్ పాలిష్ చేసేవాళ్లు. అయితే ప్రతి ప్రయాణం మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందని ఆయన గుర్తించారు. పట్టుదలతో, అంకితభావంతో పనిచేస్తూ యజమానిని ఆకట్టుకున్నారు. ఒక సంవత్సరంలోనే అతని జీతం రూ.500 నుంచి రూ.3,000కి పెరిగింది. దేబ్‌నాథ్ చాలా గంటలు పని చేసేవారు. ఇంటికి డబ్బు కూడా పంపడం ప్రారంభించారు. ఓవర్ టైం సంపాదనను సొంత జీవనోపాధికి ఉపయోగించారు.

అలా మలుపు తిరిగింది..

ఆ తర్వాత దేబ్‌నాథ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ సూపర్‌వైజర్‌గా ఉద్యోగం పొందారు. అప్పుడే ITDC (ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) హోటల్ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశారు. అప్పట్లో పెద్ద ఈవెంట్‌లు, నెట్‌వర్కింగ్‌తో పరిచయాలు పెంచుకున్నారు. అలా తన సొంత వెంచర్‌కు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త స్నేహితుల దృఢ సంకల్పం, మద్దతుతో ఆయన ‘దేబ్‌నాథ్ క్యాటరర్స్ అండ్‌ డెకరేటర్స్‌’ పేరుతో క్యాటరింగ్ కంపెనీని స్థాపించారు. కాలక్రమేణా ఆయన వ్యాపారం, ప్రభావం విస్తరించాయి. ఇప్పుడు ఆయన వివిధ నగరాల్లో ఆర్మీ మెస్‌లను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేబ్‌నాథ్ ఆస్తుల విలువ దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుంది. ఇంతగా ఎదిగినా ఆయన ఇప్పటికీ వినయపూర్వకమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version