ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఎంపీలతో భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీలు కే కేశవరావు, నామ నాగేశ్వరరావు సహా పలువురు పాల్గొన్నారు. తెలంగాణకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పై పార్లమెంటులో పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

పార్లమెంటు సమావేశాల సందర్భంగా నిరసనలు తెలియజేయాలని, అనేక కీలక అంశాలను లేవనెత్తాలని, మరియు పార్లమెంటు ఉభయ సభలలో ఒక పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని ఎంపీలకు కేసీఆర్ సూచించనున్నట్లు సమాచారం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్రాన్ని పార్లమెంటులో ఎండగట్టాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చెప్పనున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని కూడా పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని నిలదీయనున్నట్లు సమాచారం.