ఐదు నెలల్లో కాంగ్రెస్ ఐదేళ్ల అపఖ్యాతి మూటగట్టుకుంది : కేటీఆర్

-

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతి మూటగట్టుకుందని అన్నారు. చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు మండలిలో అవకాశం కల్పించొద్దని ఓటర్లకు రిక్వెస్ట్ చేశారు. 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్న కేటీఆర్, ఒక్కరికైనా పింఛన్ పెరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 3 వైద్య కళాశాలలే ఏర్పాటయ్యాయని చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆరఎస్ పాలనలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని తెలుపుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మోసపూరితమైన హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీపై పలు విమర్శలు చేస్తున్నారు. అభ్యర్థులు ఆలోచించి ఓటు వేయాలని సూచిస్తున్నారు. విద్యావంతులు, మేధావుల గొంతుకగా
ఏనుగు  రాకేశ్ రెడ్డికి అవకాశం అవ్వాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version