ఇవాళ భారత్ బంద్. దీంతో ఇండియా వ్యాప్తంగా ఈ బంద్ లో అందరూ పాల్గొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. నేడు భారత్ బంద్‌కు రిజర్వేషన్ బచావో సమితి పిలుపునిచ్చింది.. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.
అయితే… ఎస్సీ, ఎస్టీ, వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ కొనసాగుతున్న తరుణంలోనే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార సంస్థలు, స్కూళ్ళు మూతబడ్డాయి. బంద్, నేపథ్యంలో ముందస్తుగానే సెలవు ప్రకటించాయి స్కూల్ యాజమాన్యాలు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు నిరసనకారులు. ముఖ్యంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్సీ ఎస్టి వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ పట్టణంలో బంద్ చేపట్టింది తెనాలి డివిజన్ JAC.