ప్రపంచ దేశాల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంపాక్స్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య ఆత్యయిక స్థితి ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే తాజాగా మంకీపాక్స్ లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు జారీ చేసింది.
దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు ఇవే..
- ఎంపాక్స్ కేసుల పరీక్షల కోసం అత్యవసర విభాగాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.
- జ్వరం, దద్దుర్లు వచ్చిన వారికి, ఎంపాక్స్ నిర్ధరిత బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి వెంటనే మెడికల్ టెస్టులు చేయాలి.
- జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలతో వ్యాధి నిర్ధరణ చేయాలి.
- అనుమానిత కేసులను తక్షణమే ఐసోలేషన్‌లో ఉంచాలి.
- ఎంపాక్స్ అనుమానిత వ్యక్తులను వ్యాధి నిర్ధరణ, చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి తరలించాలి.
- రోగులను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలి.
- ఎంపాక్స్ అనుమానిత కేసుల విషయంలో ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు తప్పనిసరిగా ధరించాలి.