తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11వ తేదీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేయనున్నట్లు వివరించారు. స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు. తొలిదశలో సొంత స్థలం ఉన్న వారితో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సహాయం
- బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష
- పైకప్పు(రూఫ్) స్థాయిలో రూ.లక్ష
- పైకప్పు నిర్మాణం తరవాత రూ.2 లక్షలు
- నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష