బ్రేకింగ్ : ఇండ‌స్ వివా పిర‌మిడ్ చైర్మెన్ అరెస్ట్‌

ఇండ‌స్ వివా పిర‌మిడ్ సంస్థ‌ చైర్మెన్ అభిలాష్ ను కాసేప‌టి క్రితం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. త‌మ కంపెనీ కస్ట‌మ‌ర్ల‌ను మోసాం చేస్తు వేల కోట్లు ను మోసం చేశారని ఈడీ అధికారులు తెలిపారు. అందుకే ఇండ‌స్ వివా పిర‌మిడ్ సంస్థ చైర్మెన్ ను అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. అయితే ఇండ‌స్ వివా పిర‌మిడ్ సంస్థ ఎంఐఎం స్కాం పేరు తో వేల కోట్ల రూపాయల‌ను వ‌సూల్ చేశారని ఈడీ తెలిపింది. ఈ ఎంఐఎం స్కాం పై గ‌త కొద్ది రోజుల క్రిత‌మే ఇండ‌స్ వివా పిర‌మిడ్ పై కేసు న‌మోదు అయింది.

అయితే దీని పై పోలీసులు, ఈడీ అధికారులు విచార‌ణ చేసి ఈ రోజు అరెస్టు చేశారు. అయితే ఈ కేసు పై సైబ‌ర్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ అధికారులు ద‌ర్యాప్తు చేశారు. దీంతో ఈ ఎంఐఎం స్కాం కేసు లో ఈడీ అధికారులు ఇండ‌స్ చైర్మెన్ అభిలాష్ తో పాటు ఆ కంపెనీ సీఏ అంజార్‌ను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ స్కాం లో దాదాపు 10 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల నుంచి రూ. 15 వేల కోట్లు వ‌సూలు చేశారని తెలుస్తుంది.