దేశంలో 87.6 శాతం మందికి కరోనా తొలి డోస్ వ్యాక్సినేషన్

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ప్రస్తుతం దేశంలో ప్రతీ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ఆరోగ్య కార్తకర్తలు నిర్వహిస్తున్నారు. తాజాగా దేశంలో 87.6 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 136 కోట్ల కరోనా డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఓమిక్రాన్ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం చేసింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

విదేశాలతో పోలిస్తే మన దేశంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త  కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సినేషన్ రేటు భారత్ లోనే ఉందని ఆయన వెల్లడించారు. అమెరికాతో పోలిస్తే 2.8 రెట్లు అధికంగా ఉందన్నారు. యూకేతో పోలిస్తే 12.5 రెట్లు అధిక వ్యాక్సినేషన్ ఇండియాలో కొనసాగుతుందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 3 లక్షల వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో 74 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు.