తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో తనిఖీలు

-

తెలంగాణ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్, డైగ్నోస్టిక్ కేంద్రాల్లో వైద్యాధికారులు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో నల్లగొండ లో 6 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నల్లగొండలో 5 ల్యాబ్లు, ఒక ప్రైవేట్ ఆస్పత్రి సీజ్ చేశారు. ఆదిలాబాద్ లో 3 ఆస్పత్రులకు నోటీసులు అందజేశారు.

వరంగల్, నారాయణపేట్ జిల్లాలో ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో 2 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ములుగులో 3 ప్రైవేట్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. మరో వారం రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగనున్నాయి.

ఆసుపత్రులలో కనీస సదుపాయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. అనుమతులు, మౌలిక వసతులు పాటించని ఆసుపత్రులను సీజ్ చేస్తున్నారు. మరికొన్ని ఆసుపత్రులకు శోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆసుపత్రుల నిర్వహణలో లోపాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version