వచ్చే ఎన్నికల్లో 70 నుంచి 74 సీట్లు కాంగ్రెస్ గెలవబోతుంది : భట్టి విక్రమార్క 

-

ఇవాళ ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై  ఉంది. వచ్చే ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలవబోతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ అహంకారంగా వ్యవహరిస్తోంది. ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు భట్టి. రాష్ట్ర ప్రజలకు విజ ప్తి చేస్తున్నారు. గ్యారెంటీ కార్డు తీసుకొని రాగానే ఇంటి స్థలం ఇస్తారు. రూ.5లక్షలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు. 

ఫీజు రీయంబర్స్ మెంట్ ఉంటుంది. చదువుకోవడానికి రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు. ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. స్కూల్ కి వచ్చేందుకు పిల్లలకు ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని స్పస్టం చేశారు భట్టి.  పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను తిరిగి అప్పగిస్తాం. కాంగ్రెస్ మెనిఫెస్టో చూసి బీఆర్ఎస్ ఆగమవుతోంది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ తూచ తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news