తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా 33 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తామని ప్రకటన చేశారు. టీ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. వచ్చే మూడు సంవత్సరాలలో 93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది.
దీనికోసం వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో.. చర్చలు జరుగుతున్నట్లు వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి… సంగారెడ్డి, నారాయణపేట మరికొన్ని ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్నామని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. తమ ప్రభుత్వ హయాంలోనే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇచ్చి తీరుతామని కూడా వివరించడం జరిగింది. దాంతో… సాంకేతికంగా కూడా తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారని… డబ్బులు కూడా ఆదా అవుతాయని తెలిపారు. అయితే ఈ ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తారా లేదా అనే దాని పైన మాత్రం శ్రీధర్ బాబు ప్రకటన చేయలేదు.