Telangana : అర్ధరాత్రి ఓయూ లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకులు

-

సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ లో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించారు. బాత్రూం కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి, విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని చున్నితో కట్టేసి పోలీసులకు అప్పగించారు.

Intruders broke into OU ladies hostel in the middle of the night

మరొకరు పారిపోయారు. హాస్టల్ లో తమకు రక్షణ కరువైందని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు నిరసనకు దిగారు. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. ఇక తాజాగా ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకులు చొరబడటంపై తమకు రక్షణ లేదంటూ, సీసీటీవీలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని.. తమకు న్యాయం జరిగే వరకు అగంతకుడిని తీసుకెళ్లొద్దంటూ పోలీసుల ముందు నిరసనకు విద్యార్థినిలు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version