నార్సింగి పోలీస్ స్టేషన్ లో రెండు సంచలన కేసుల దర్యాప్తు..!

-

నార్సింగి పోలీస్ స్టేషన్ లో రెండు సంచలన కేసుల దర్యాప్తు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదై.. చంచల్ గూడ జైలుకి వెళ్లిన విషయం తెలిసిందే. చంచల్ గూడ జైలు నుంచి   నార్సింగి పోలీసులు  విచారించేందుకు నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఇందుకు నిన్న కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ జానీ మాస్టర్ ను కలిసేందుకు నార్సింగి పోలీస్ స్టేషన్ కి పలువురు హాజరైనప్పటికీ కేవలం భార్య అయేషాకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవలే యూట్యూబ్ స్టార్ హర్ష సాయి పై ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. తనకు 2 కోట్ల వరకు డబ్బులు ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఇవాళ పోలీసులకు సాక్ష్యం చెప్పేందుకు బాధితురాలుతో పాటు కో ప్రొడ్యూసర్, సాక్షులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. వీరంతా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఈ రెండు కేసుల దర్యాప్తు అనేది సంచలనంగా మారిందనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news