KTR : బ్రస్సెల్స్‌లో సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఏడాది అక్టోబర్ 24న బ్రస్సెల్స్ లో నిర్వహిస్తున్న ‘టెక్ యాక్సిలేటర్ సదస్సు’లో పాల్గొనాల్సిందిగా టోని బ్లేయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ మంత్రి కేటీఆర్ కు ఆహ్వాన పత్రం పంపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పాత్ర… కీలక సాంకేతిక సమస్యలపై చర్చించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ఈ ఆహ్వానం ఒక గుర్తింపుగా భావిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లేయిర్ నేతృత్వంలో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఇక అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు.. ఆదిత్య, ఆర్య చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల వారిద్దరూ కలిసి సినర్జీ ఆఫ్‌ మైండ్స్‌(ఎస్‌ఓఎం) ఫౌండేషన్​ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ సోదరులు.. ఆడబిడ్డల చదువుకు చేయూతనిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news