ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

-

ఐపీఎస్‌ అధికారి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. ఇటీవల ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న కారణంతో సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని అంజనీ కుమార్‌ ఈసీకి వివరించారు. ఈ క్రమంలో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్‌ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని… ఇలాంటిది మరోసారి జరగదని సీఈసీకి అంజనీకుమార్‌ హామీ ఇచ్చారు. దీంతో సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం ఇచ్చింది.

అసలేం జరిగిందంటే.. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్.. రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్​(అప్పుడు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండటంతో)ను కలవడాన్ని ఖండించింది. రేవంత్​ను కలిసి, సెల్యూట్​ చేసి పుష్చ గుచ్ఛం ఇవ్వడాన్ని తప్పుగా పరిగణించింది. ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకముందే ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో నిబంధనలు పాటించలేదని డీజీపీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news