ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రభుత్వమే రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. 8 మంది ప్రాణాల కంటే ఎన్నికలే ఈ సీఎంకు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రమాదం జరిగి మూడు రోజులవుతున్న రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లలేదని.. హెలికాప్టర్ లో సీఎం
ఎన్నికల ప్రచారానికి వెళ్తే హెలికాప్టర్ లేదని ఇరిగేషన్ మంత్రి ఇంట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. రెస్కూ ఆపరేషన్ కంటే ఈ సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కువయ్యాయన్నారు. సోమవారం ఓ మీడియా చానల్ తో మాట్లాడిన హరీశ్ రావు.. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని ఎస్ఎల్ బీసీ సొరంగం వద్ద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, కాంగ్రెస్ తొందరపాటు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే రూ.600 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం SLBC కోసం ఖర్చు చేసిందన్నారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగుబాటుకు గురైతే ఇదేదో భారీ అవినీతి అని విమర్శించారు.