మార్చి 31లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

-

మార్చి 31లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని బలపరచాలని మంచిర్యాలలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. 11 ఏళ్లలో మోడీకి రాష్ట్రానికి రెండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. పెట్టుబడులతో పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. ఏడాది కాలంలో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు.

గత పదేళ్లలో ఏనాడైనా కేసీఆర్ మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులతో కేసీఆర్ దివాళా తీయించారు. ఎన్నికల్లో పోటీ చేయనోడు.. కాంగ్రెస్ ను ఓడించాలంటున్నాడు అంటే ఎవ్వరికీ మద్దతు ఇస్తున్నట్టు అని ప్రశ్నించారు. మేము బీఆర్ఎస్ స్కామ్ ల మీద కేసులు పెడితే ఈడీ పేపర్లను లాక్కెళ్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఎజెండా ఏంటి అని ప్రశ్నించారు. వీళ్ల కుట్రలను ప్రజలు గమనించి.. మీ బిడ్డలను కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయించి గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news