హైదరాబాద్ అంటే హైటెక్ సిటేనా..? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ కంటే ఎక్కువగా బీజేపీ టార్గెట్ చేస్తోంది. ప్రదాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయినప్పటికీ బీజేపీ-కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోటీ ఉంటడంతో విమర్శిస్తుంది. మరోవైపు కొంత మంది ఎంపీలు రేవంత్ ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హైదారాబాద్ అంటే కేవలం హైటెక్ సీటీ మాత్రమే కాదని.. పాత నగరంలో కూడా అందులో అంతర్భాగమేనని పేర్కొన్నారు.  ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కేవలం హైటెక్ సిటీ ప్రాంత అభివృద్ధి పై చూపిస్తుందని ఆరోపించారు. నగరంలో అంబర్ పేట, ముషీరాబాద్ లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. చాలా ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ లాంటి సంస్థలు నిధులు కొరతతో సతమతం అవుతున్నాయని తెలిపారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి పని చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version