సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలపై చేతులెత్తేసారు. ఎన్టీఆర్ వైద్య సేవ… ఇక పై నడపలేం అంటూ నోటీసు ఇచ్చారు. రాజశేఖరరెడ్డి పథకం.. కాంగ్రెస్ పథకం.. ఆరోగ్యశ్రీ.. అటు టీడీపీ, వైసీపీ ఎంపీలు ఎన్డీఏ లోనే ఉన్నారు. జగన్ విషయం పక్కన పెడితే… చంద్రబాబు కు ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఉంది అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పార్టీలకు అతీతంగా 25 మంది ఎంపీలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు. ఒక్క సూపర్ స్పెషాలిటీ అసోసియేషన్ కే 3000 కోట్లు బకాయిలు ఉన్నాయట.
తల్లికి వందనం పథకం పై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు… లోకేష్ ఈ పథకం జరగకపోవచ్చు అంటున్నారు. మీ డేటా లేనపుడు.. గత డేటా అయినా మీదగ్గర ఉండాలి కదా. అసలు ఇవ్వకపోవడానికి డేటా లేదనడం సరికాదు. మహిళలకు ఉచితబస్సు ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఏమీ ఇవ్వకపోగా… ఇంకా విత్తనాల అంశం పై ఏమీ మాట్లాడలేదు. ఏం అడిగినా చంద్రబాబు డబ్బులు లేవు… అప్పులే ఉన్నాయి అంటున్నారు. కూటమితో జతకట్టిన మీపై.. అక్కడి నుంచీ డబ్బులు తేవాల్సిన బాధ్యత ఉంది షర్మిల పేర్కొన్నారు.