పోలీస్ ని కాంగ్రెస్ ఎమ్మెల్యే పాగల్ అనడం నేరమే.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

-

రౌడీల, రేవంతుల రాజ్యంలో పాపం పోలీసులకే రక్షణ కరువు అయ్యిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పోలీసు అధికారికి  జరిగిన ఘర్షణపై స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ డీజీపీ, ఏసీపీ జానీ నర్సింహులు  మామూలు పోలీస్ అధికారి కాదని, అత్యంత ధైర్య సాహసాలు చూపించి ఎన్నో సార్లు డిపార్ట్మెంట్ పరువు కాపాడిన వ్యక్తి అని, సహచరుల రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా
వెరవని ఖాకీ బుల్లెట్  అని కొనియాడారు.


అలాగే పాపం నర్సింహులు ఒక ఎస్సీ కావడం వల్ల యాక్సిలరేటెడ్ ప్రమోషన్  కూడా ఇవ్వలేదు ఈ డిపార్ట్మెంట్ అని, ఫారిన్ మందు సీసాలు మోసిన కొంత మందికి మాత్రం దొడ్డిదారిన ఆక్సిలరేటెడ్ ప్రమోషన్లు వచ్చాయని, ఆ చిట్టా మళ్లెప్పుడైనా బయట పెడతానని చెప్పారు. అంతేగాక అలాంటి నిజాయితీ కల నిప్పులాంటి ఆఫీసర్ ను రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్  పాగల్ గాడు అనడం ముమ్మాటికీ నేరమేనని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ రాజ్యం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై కేస్ పెట్టాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news