సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు త్వరలో నోటీసులు కూడా రానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు పేపర్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు జయశంకర్ వర్సిటీ అధికారులు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ పైన న్యాయనిపుణుల సూచనలతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. వర్సిటీ నుంచి వెహికల్ అలవెన్స్ కింద తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలంటున్నారు అధికారులు.
దాదాపు రూ.61 లక్షలు తీసుకోవడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. CMO అదనపు కార్యదర్శిగా ఉన్నప్పుడు తీసుకున్నట్లు గుర్తించారు. 2016 నుంచి 2024 వరకు నెలకు రూ.63 వేలు చొప్పున 90 నెలలు తీసుకున్నారు స్మితా సభర్వాల్. తెలంగాణ ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక రానుంది. ఇది రాగానే…సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ పై చర్యలు ఉంటాయని చెబుతున్నారు.