Relief for Harish Rao and Radhakishan Rao in the High Court: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌టాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది హై కోర్టు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై పంజాగుట్ట పీఎస్‌లో ఫోన్ టాపింగ్ కేసు నమోదు అయింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

దీంతో మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులను నిందితులుగా చేర్చారు పోలీసులు. దీనిపై ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిశాయి. నేడు తీర్పు వెలువరించింది హైకోర్టు. ఫోన్ టాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. దీంతో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది.