వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి.. టిక్కెట్ల విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ.. ఆ దిశగా ఇద్దరు అధినేతలు గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారు. అయితే జనసేన పార్టీలో తాజాగా ఒక టాక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఒక్క చోటే పోటీ చేస్తారా లేక.. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని చర్చ నడుస్తుంది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేయడానికి అక్కడ ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు.. అయితే ఈసారి తప్పులు రిపీట్ చేయకుండా కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట..
జనసేన ఏం చెబుతోంది..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ జనసేనలో పెద్ద ఎత్తున నడుస్తుంది.. గత ఎన్నికల్లో చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని జనసేన ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే తన ప్రాబాల్యన్ని చాటుకుంది.. ఈసారి టిడిపి తో పొత్తు పెట్టుకోవడంతో మెజార్టీ స్థానాల్లోనే గెలుస్తామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు..
పిఠాపురం నుంచి పవన్ పోటీ..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్… పిఠాపురం నుంచి పోటీ చేస్తారని పార్టీలో టాక్ నడుస్తుంది.. ఆ దిశగా పవన్ సన్నిహితులు గ్రౌండ్ వర్క్ కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.. కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం కూడా పిఠాపురము కావడం ఆ ప్రచారాలకు బలం చేకూరుస్తుంది.. 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన దొరబాబు విజయం సాధించారు. పవన్ ఇక్కడ పోటీ చేస్తే పరిస్థితి ఏంటనే జనసేన పలు సర్వేలు చేసిందట.. అందులో పాజిటివ్ రావడంతో పవన్ ఇక్కడ నుంచే పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.. మరోపక్క పార్టీలో మరో వర్గం రెండు చోట్ల పవన్ పోటీ చేస్తారని ప్రచారం చేస్తుంది.. మరో రెండు వారాల్లో ఈ విషయం పై క్లారిటీ రానుంది..