వందల్లో ఉన్న పెన్షన్ వేలల్లోకి పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే : కేసీఆర్

-

ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు. గతంలో ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా పెన్షన్ ఇవ్వలేదని తెలిపారు సీఎం కేసీఆర్. రైతుబంధు ఇంతకు ముందు ఎవ్వరూ ఇవ్వలేదు. రైతు కుటుంబం బజార్ లో పడకూడదని.. రూ.5లక్షలతో రైతుబీమా పథకం ప్రారంభించాం. ఐటీ రంగంలో బెంగళూరును దాటేస్తామని చెప్పారు. రైతుబంధఉను పుట్టించిందే కేసీఆర్. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయంలో 21 స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

వందల్లో ఉన్న పెన్షన్ ను వేలల్లోకి పెంచామని గుర్తు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ నిర్వాహకం వల్ల 58 ఏండ్లు గోసపడ్డామని తెలిపారు. తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. విధి వంచితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రైతులు 10 హెచ్.పీ మోటార్ పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. 10 హెచ్.పీ మోటార్లు రైతులకు ఎవ్వడు కోనియ్యాలని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news