ప్రతీ జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్.. ఐటీ మినిష్టర్ మొదలు పెడుతున్న జాబ్ మేళా..!

-

యువతకి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లా లో కూడా స్కిల్ సెంటర్లు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదెళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కూడా ఉంటుందని ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని ప్రైవేట్ రంగం లోనూ యువత కి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన కి చర్యలని ముమ్మరం చేస్తున్నామని చెప్పారు.

జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల మంత్రి డి శ్రీ దర్ బాబు వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. సికింద్రాబాద్లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయం లో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళా ని మొదలుపెట్టారు శ్రీధర్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news