హను-మాన్ ఓటీటీ రైట్స్ వివరాలు ఇవే..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

-

సంక్రాంతి సందర్భంగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా హను-మాన్ సినిమా విడుదలైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదట్నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది. ఇక టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు అమాంతం ఆకాశానికెత్తాయి. ఇవాళ సినిమా విడుదలతో ఆ చిత్రం అంచనాలకు మించిన టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ఈ విజువల్ వండర్ ఫీస్ట్కు ఫిదా అయిపోతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.

హనుమాన్ మూవీ ఓటీటీ, శాటిలైట్ పార్టనర్స్ వివరాలు కూడా తాజాగా తెలిశాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు టాక్. ఓటీటీ హిందీ వెర్షన్ రూ. 5కోట్లు, తెలుగు వెర్షన్‌ రూ. 11 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇప్పుడు సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. మార్చి నెల మధ్యలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news