మహారాష్ట్ర లోని ముంబయి నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయగడ్ జిల్లాలోని సహవా శేవాను కలుపుతూ రూ.17,840 కోట్లు అంచనా వ్యయంతో ఆరు లైన్లుగా నిర్మించారు. ఈ 2016 డిసెంబర్ నెలలో ప్రధాని వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి గౌరవార్థం ఈ బ్రిడ్జ్ కి అటల్ సేతు అని నామకరణం చేసారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ నాసిక్ కాలరామ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఇవాళ నాసిక్ రావడం చాలా సంతోషంగా ఉంది. రాముడు చాలా కాలం పాటు పంచవటిలో ఉన్నారు. అన్ని ఆలయాలల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రపంచంలోనే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అని తెలిపారు ప్రధాని. టెక్నాలజీ రంగంలో భారత్ వృద్ధి సాధిస్తుందన్నారు.