తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

శనివారం సీఎం రేవంత్ వరంగల్‌లో పర్యటించగా.. ఆ టూర్‌కు ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని దొంతి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారట.