అంబేద్కర్ రెండు సార్లు గెలవకుండా చేసింది కాంగ్రెస్ పార్టీనే : మోడీ

-

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.బీఆర్ఎస్ పార్టీ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లను అణిచివేసింది. బీజేపీ రామ్ నాథ్ కోవింద్ ని రాష్ట్రపతిగా ప్రకటిస్తే.. కాంగ్రెస్ వ్యతిరేకించింది. తొలి దళిత రాష్ట్రపతిని చేసిన పార్టీ బీజేపీనే అని తెలిపారు. అంబేద్కర్ కు కాంగ్రెస్ భారతరత్న కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను అణిచివేస్తుందని తెలిపారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ తో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. కాంగ్రెస్ పార్టీతో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ. పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని తెలిపారు. దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశాడు.. బీఆర్ఎస్ నేతల బంధువుల స్కీమ్ గానే దళిత బంధు మారిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో ఇండియా అనే కూటమి ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ దళిత నాయకుడిని అవమానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news