మహేష్ గౌడ్ కు పీసీసీ పదవి ఇవ్వడంపై జగ్గారెడ్డి స్పందించారు. . సిఎంగా రేవంత్… రెడ్డి సామాజిక వర్గం కాబట్టి…బీసీ నేత మహేష్ గౌడ్ కు పిసిసి ఇచ్చింది ఏఐసీసీ అన్నారు. తనకు పిసిసి కావాలనే ఆలోచన మారదని.. స్వేచ్చగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ లోనే ఉంటుందన్నారు. ఏఐసిసి రెడ్డి లకు పిసిసి ఇప్పుడు ఇవ్వద్దని అనుకుంది… అందుకే బీసీ కి ఇచ్చారన్నారు. రెడ్డి లకు ఇవ్వాలని అనుకుంటే జగ్గారెడ్డి చర్చ లోకి వస్తాడని వెల్లడించారు.
కాంగ్రెస్ లో చాలా సంతోషంగా ఉన్న నేను….నాకు ఏ పోస్ట్ వస్తుంది అనేది నేను చర్చ చేయనని తెలిపారు జగ్గారెడ్డి. మహేష్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి పిసిసి ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ గొప్పతనమని కొనియాడారు. బీజేపీలో ప్రెసిడెంట్ అవ్వాలంటే కుదరదని…ఎప్పుడు పదవి వస్తుందో..ఎప్పుడు పోతుందో బీజేపీ లో తెలియదని తెలిపారు. ప్రాంతీయ పార్టీలో వేరే వాళ్లకు అవకాశమే లేదన్నారు. ఐతే తండ్రి..లేకుంటే కొడుకే అధ్యక్షుడు అవుతారని వెల్లడించారు.