సంగారెడ్డిలో ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన పోస్ట్ చేశారు. 5 ఏళ్లు నాకు ప్రజలు రెస్ట్ ఇచ్చారన్నారు. ఒక బలవంతడు భూమి మీద ఎప్పటికి బలవంతుడిలాగే ఉండడు..కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడని వివరించారు. ఎదో ఒక్కరోజు బలహీనుడు కాకతప్పదని తెలిపారు. ఇది ఏ వ్యవస్థలో నైనా వ్యాపారం, రాజకీయం ఇంకా ఏ రంగలోనైనా ఇంతేనని..అలాగే బలహీనుడు ఎప్పటికి బలహీనుడు గానే ఉండడన్నారు.
జగ్గారెడ్డిగా నేను 5 సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసానని…3 సార్లు సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించారని గుర్తు చేశారు.అధికార పార్టీ ఎమ్మెల్యే గా ప్రతిపక్షగా పార్టీ ఎమ్మెల్యే గా మంచిగా పరిపాలించానని…మొదటి సారి 2014 లో ఓడిపోయానన్నారు. ఆ ఓటమి నాకు చాలా అనుభవాలు నేర్పింది…ఇప్పుడు 2023లో రెండోసారి ఓడిపోయా…మళ్లీ చాలా నేర్చుకుంటానన్నారు. ఐతే ఈ సారి మా సంగారెడ్డి ప్రజలకు నాకు 5 ఏళ్లు రెస్ట్ ఇచ్చారు…అందుకే ఈ సమయాన్ని నేను పూర్తిగా పార్టీ ఆర్గనైజేషన్ కోసం పని చేయాలనీ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.