చిన్నారికి సొంత డబ్బుతో గుండె ఆపరేషన్ చేయించిన జనసేన ఎమ్మెల్యే

-

గుండె జబ్బు ఉన్న చిన్నారికి సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించాడు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.  తాడేపల్లి గూడెం నియోజకవర్గం నిడమర్రు మండలం పెద్ద నిండ్రకొలను గ్రామానికి చెందిన బొంగా సురేష్, జ్యోత్స్న దంపతులకు నెల కింద బిడ్డ పుట్టింది. అయితే ఆ నెల బిడ్డ గుండెకు రంధ్రం పడటంతో అనారోగ్యానికి గురయ్యారు.

దీంతో వెంటనే ఆపరేషన్ చేయకుంటే బిడ్డకు ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పారు. అయితే  పేదవారు కావడంతో ఆ తల్లిదండ్రులు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ని ఆశ్రయించారు. ఈ ఆపరేషన్‌కు సుమారు 7 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు అవ్వగా.. బొలిశెట్టి శ్రీనివాస్ మొత్తం తానే చూసుకొని తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో బిడ్డ కు చికిత్స అందించి, ప్రాణాలు కాపాడాడు. దీంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news