ఉద్దేశ పూర్వకంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నారు..!

-

ప్రతి నియోజక వర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించబోతున్నం. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్ లో ఐదు వేల కోట్లు పెట్టాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 100 నియోజక వర్గాల్లో స్కూల్స్ కట్టబోతున్నం. ఇక పది పదిహేను రోజుల్లో వీసీ ల నియామకం. గతంలో పరీక్షలు పెట్టాలి అని ఆందోళన జరిగేది. ఇప్పుడు మేము పరీక్ష పెడుతుంటే.. కొందరు వద్దు అని ఆందోళన చేయిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. గతంలో ఇలాగే రెచ్చగొట్టడంతో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారు అని సీఎం అన్నారు.

కానీ వాళ్ళ త్యాగం మీద రాజకీయం చేశారు. వాళ్ళ ఉద్యోగాలు పొగానే మళ్ళీ విద్యార్థుల రెచ్చగొడుతున్నారు.. విద్యార్దులు ఎందుకు.. బావ బమ్మార్డులు కేటీఆర్, హరీష్ రావులు దుక్కలెక్క ఉన్నారు . మీరు దీక్షలు చేయండి అని నేను చెప్పిన అంటూ పేర్కొన సీఎం రేవంత్ రెడ్డి… విద్యార్దులు వారి కుట్రలకు లొంగ కండి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news